ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు ఆమె మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. ఈ ఘటనపై అమ్మ కూడా బాధపడుతుందన్నారు. వైఎస్సార్ బిడ్డ పోరాటం చేసింది నిరుద్యోగుల కోసమేనన్నారు.
సచివాలయంలో వినతి పత్రం ఇవ్వడానికి కూడా స్వేచ్చ లేదు. జర్నలిస్టులకు స్వేచ్చ లేదు. సచివాలయంలో కనీసం ఒక్కరూ లేరట.. సీఎం రాడు.. మంత్రులు లేరు.. అధికారులు రారు అని మండిపడ్డారు. వీళ్లకు పాలన చేతకాదు అనడానికి ఇదే నిదర్శనం అన్నారు. వీళ్లకు ఏది చేతకాదు. బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం నోటిఫికేషన్ లు ఇవ్వడం చేతకాలేదన్నారు. ఒక అడబిడ్డ అని చూడకుండా ఈ విధంగా ప్రవర్తించడం పాపం అన అన్నారు.