అమరావతి: రాష్ట్రంలో ప్రజలకు ఇంపార్ట్‌టెంట్ నోట్. రేషన్ లబ్ధిదారుల ఈ కేవైసీ ఈ నెల 31లోగా పూర్తి చేయాలని పౌరసరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్ జిల్లా అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల మొబైల్ యాప్, రేషన్ షాపులోని ఈ పాస్ పరికరాల ద్వారా అప్టేట్ చేసుకునే అవకాశం ఉంది. ఐదేళ్ల లోపు పిల్లలు మినహా గడువులోగా ఈ కేవైసీ పూర్తి చేయకపోతే లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కమిషనర్ హెచ్చరించారు. ఈకేవైసీ చేయించుకోకుంటే వచ్చే నెల నుంచి రేషన్ బియ్యం పొందేందుకు వీలుండదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఎన్‌ఐసీ ఆధ్వర్యంలో పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసే వాటిలో పారదర్శకత కోసం సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేస్తున్నారు. ఇది వరకు రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ లేకపోయినా బియ్యం, ఇతర సరకులు ఇచ్చే వారు. అయితే ఇకపై ఈకేవైసీ నమోదు చేసుకున్నవారికే సరుకులు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఈకేవైసీ నమోదు చేసుకోని వారంతా ఈ నెల 31లోగా పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించాలని ప్రజలకు అధికారులు సూచనలు చేస్తున్నారు.