Andhrapradesh: టెట్ హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ - 2024 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి.
By అంజి
Andhrapradesh: టెట్ హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ - 2024 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి హాల్ టికెట్లను పొందొచ్చు.
హాల్ టికెట్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
- ముందుగా టెట్ అభ్యర్థులు https://aptet.apcfss.in/# వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ఆ తర్వాత హోం పేజీలో కనిపించే AP TET Hall Tickets(July) 2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ అభ్యర్థి Candidate ID, డేట్ ఆఫ్ బర్త్‌తో పాటు Verfication Codeను ఎంటర్ చేయాలి.
- లాగిన్ పై క్లిక్ చేస్తే టెట్ హాల్ టికెట్ ట్యాబ్‌పై డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్‌లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్ పరీక్షలు రెండు సెషన్లలో 18 రోజుల పాటు జరుగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.
పరీక్షలు జరిగిన తర్వాత అక్టోబర్ 4 నుంచి వరుసగా ప్రైమరీ 'కీ' లు అందుబాటులోకి వస్తాయి. అక్టోబర్ 5 నుంచి ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరణ ఉంటుంది. అక్టోబర్ 27న టెట్ ఫైనల్ కీ విడుదల చేస్తారు. నవంబర్ 2న ఏపీ టెట్ - 2024 ఫలితాలను ప్రకటిస్తారు.