'మార్కులు వేయకపోతే మంత్రం వేయిస్తా'.. విద్యార్థి ఆన్సర్‌కు టీచర్‌ షాక్‌

పరీక్షలు సరిగా రాయకపోతే సాధారణంగా విద్యార్థులు బాధపడతారు. కానీ ఓ విద్యార్ధి ఏకంగా మార్కులు వేయకపోతే చేతబడి చేయిస్తా అంటూ బెదిరించాడు.

By అంజి  Published on  10 April 2024 5:46 AM GMT
teacher, tenth answer sheet, student, Bapatla, APNews

'మార్కులు వేయకపోతే మంత్రం వేయిస్తా'.. విద్యార్థి ఆన్సర్‌కు టీచర్‌ షాక్‌

పరీక్షలు సరిగా రాయకపోతే సాధారణంగా విద్యార్థులు బాధపడతారు. కానీ ఓ విద్యార్ధి ఏకంగా మార్కులు వేయకపోతే చేతబడి చేయిస్తా అంటూ బెదిరించాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్ధి ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు. సరిగ్గా రాయలేదో ఏమో తన జవాబు పత్రంలో తనకు మార్కులు వేయకపోతే.. చేత చేతబడి చేయిస్తానని పేర్కొన్నాడు. బాపట్ల జిల్లాలోని పురపాలక ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం నిర్వహించారు. ఈ క్రమంలోనే పేపర్లు దిద్దుతున్న ఓ టీచర్‌ కంగుతిన్నారు.

తెలుగు సబ్జెక్టులో రామాయణ ప్రాశస్త్యం గురించి వివరించండి అన్న ప్రశ్నకు ఓ విద్యార్థి వింత సమాధానం రాశాడు. 'నాకు మార్కులు వేయకపోతే.. మా తాత చేత చేతబడి చేయిస్తా' అని ఉండటం చూసి టీచర్‌ అవాకయ్యారు. వెంటనే ఆన్సర్‌ షీట్‌ను ఉన్నతాధికారులకు చూపించారు. అయితే ఆ విద్యార్థికి 70 మార్కులు రావడం విశేషం. ఇదిలా ఉంటే.. మరో ఆన్సర్‌ షీట్‌లో రామాయణంలో పాత్ర స్వభావం గురించిన ప్రశ్నకు.. 'మంధర.. శివాజీ మహారాజును తీసుకుని దండకారణ్యానికి వెళ్లింది' అని రాయడంతో ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు.

Next Story