సీఐడీ తీరుపై అనుమానం కలుగుతోంది: పీవీ రమేష్
తన వాంగ్మూలం ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేశారనటం హాస్యాస్పదంగా ఉందని పీవీ రమేష్ అన్నారు.
By అంజి Published on 11 Sept 2023 12:49 PM IST
సీఐడీ తీరుపై అనుమానం కలుగుతోంది: పీవీ రమేష్
ఏపీ: స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారం కేసులో చంద్రబాబు నాయుడిని సిఐడి అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన పీవీ రమేష్ స్పందించారు. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో తన స్టేట్మెంట్ ఆధారంగానే కేసు పెట్టారనడం దిగ్భ్రాంతికరమని విశ్రాంతి ఐఏఎస్ అధికారి గతంలో ఏపీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన పివి రమేష్ అన్నారు. ఈ కేసుపై గతంలో సిఐడి కి లిఖితపూర్వక సమాధానం ఇచ్చానని వెల్లడించారు.
తన వాంగ్మూలం తోనే చంద్రబాబును అరెస్టు చేశారనడం హాస్యాస్పదం.. తాను అప్రూవర్ గా మారాననే ప్రచార అవాస్తవం అంటూ పీవీ రమేష్ మండిపడ్డారు. అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారు? అంటూ ప్రశ్నించారు. ఇప్పటివరకు స్కిల్ డెవలప్మెంట్‌లోని ఆర్థిక శాఖ ఏ తప్పు చేయలేదు తనకు సిఐడి తీరుపై అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. గతంలో నిధులు విడుదల చేసిన వారిలో కొందరి పేర్లు ఈ కేసులో లేవు స్కిల్ డెవలప్మెంట్ ఎండీ, కార్యదర్శి వీళ్ల పాత్రే ప్రధానం వారి పేర్లు ఎందుకు లేవు? అని ప్రశ్నించారు. సీఎంగా ఉండేవారు కొన్ని వందల అంశాలను పర్యవేక్షిస్తారని అన్నారు.
ప్రతి ఒక్క శాఖను క్షుణ్ణంగా పరిశీలించలేరు. ముఖ్యమంత్రిగా ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఆయా శాఖ అధికారులే ప్రధాన బాధ్యత వహించాలి. ఎప్పటికప్పుడు ఆయా శాఖ అధికారులు సీఎంకు సమాచారం అందించాలి. అంతేకానీ ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్‌లో ఏం జరుగుతుందో సీఎంకి ఎలా తెలుస్తుంది. ఆనాడు విధాన నిర్ణయం తీసుకున్న ఫైల్స్ ఏమయ్యాయి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫైల్స్ చూస్తే ఆ విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. స్కిల్ డెవలప్మెంట్‌పై రాసిన నోట్ ఫైల్స్ ఏమయ్యాయి? సీఎం అధికారుల మీద ఒత్తిడి తెచ్చి డబ్బులు రిలీజ్ చేయడం జరగదు. తప్పు చేసిన అధికారులను కాకుండా మాజీ సీఎం అరెస్ట్ చేయడం ఏంటి? పివీ రమేష్ ప్రశ్నించారు.