దీర్ఘకాలిక పెండింగ్ బిల్లులకు మోక్షం, రూ.2 వేలకోట్లు చెల్లించనున్న ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్‌లో దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ బిల్లులకు విముక్తి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

By Knakam Karthik
Published on : 30 March 2025 6:00 PM IST

Andrapradesh, Cm Chandrababu, Revenue Minister Payyavula Keshav, Pending Bills

దీర్ఘకాలిక పెండింగ్ బిల్లులకు మోక్షం, రూ.2 వేలకోట్లు చెల్లించనున్న ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్‌లో దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ బిల్లులకు విముక్తి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బిల్లుల చెల్లింపుల్లో చిన్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పయ్యావుల కేశవ్ సమావేశం అయ్యారు. బిల్లుల చెల్లింపులపై కసరత్తు చేశారు. సుమారు 17 వేల మందికి రూ. 2 వేల కోట్ల మేర చెల్లింపులు చేయనున్నారు.

నీరు-చెట్టు, పాట్ హోల్ ఫ్రీ రోడ్లు, నాబార్డు పనులకు బిల్లుల చెల్లింపులు చేయనున్నట్లు మంత్రి పయ్యావుల వెల్లడించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ బిల్లులతో పాటు పోలవరం ప్రాజెక్టుకూ కొంత మొత్తం విడుదల చేయనున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలన్న సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో పని చేస్తున్నామని చెప్పారు. ఎన్ని ఇబ్బందులున్నా పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు బిల్లుల చెల్లింపులు దోహదం చేస్తాయన్నారు. గత మూడు నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లులను కూడా చెల్లిస్తున్నట్లు చెప్పారు.

Next Story