నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 6,511 పోలీస్ ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ విడుద‌ల‌

Ap Police Recruitment 2022 Notification Out For 6511 Constable Si Jobs. ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పోలీసు నియామకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం

By Medi Samrat
Published on : 28 Nov 2022 4:14 PM IST

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 6,511 పోలీస్ ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ విడుద‌ల‌

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పోలీసు నియామకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 411 సివిల్, రిజర్వ్ ఎస్సై పోస్టులు, 6100 సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 2023 ఫిబ్రవరి 19న సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టులకు పరీక్ష నిర్వహిస్తారు. జనవరి 22న కానిస్టేబుల్ పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు.

మొత్తం 6,511 పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్‌లో సివిల్ విభాగంలో 3580 పోలీస్ కానిస్టేబుల్, 411 ఎస్ఐ పోస్టులు, 96 రిజర్వ్ ఎస్ఐ పోస్టులు, 2520 ఏపీ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. కాగా ఇటీవల ప్రతి ఏటా 6,500 నుంచి 7 వేల వరకు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని ఇటీవల పోలీసు శాఖను సీఎం జగన్ ఆదేశించారు. ఈమేరకు పోలీసు శాఖ 6,511 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ, స్క్రూటినీ ప్రక్రియ మొదలుపెట్టనుంది. ఏపీలో ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని నెలల నుంచి కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని పోలీసు శాఖలో రిటైర్‌మెంట్స్, పదోన్నతులు, మరణాలతో పాటు.. ఏపీ ప్రభుత్వం పోలీసు శాఖకు వీక్ ఆఫ్ ఇస్తుండటంతో సిబ్బంది కొరత ఉంది.


Next Story