కార్డన్‌ సర్చ్‌ ఆపరేషన్‌.. వాటిని దాచినట్లు తెలిస్తే చర్యలు తప్పవు

శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు నేరాలను అదుపు చేసేందుకు పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ హరీశ్‌ గుప్తా తెలిపారు

By Medi Samrat  Published on  23 May 2024 10:09 AM IST
కార్డన్‌ సర్చ్‌ ఆపరేషన్‌.. వాటిని దాచినట్లు తెలిస్తే చర్యలు తప్పవు

శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు నేరాలను అదుపు చేసేందుకు పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ హరీశ్‌ గుప్తా తెలిపారు. జిల్లాల వ్యాప్తంగా అన్ని ముఖ్యమైన సర్కిళ్లు, గ్రామాలు, నగర శివార్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ డ్రిల్‌లో నిందితులు, పాత నేరస్తులు, పాత నేరస్తుల ఇళ్లు, అక్రమ మద్యం నిల్వ చేసే రహస్య స్థలాలు, హానికరమైన ఆయుధాలు, టపాసులు, డ్రగ్స్, వస్తువులు, రికార్డులు లేని వాహనాలు తదితర వాటి గురించి పోలీసులు సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు.

పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని సమగ్ర విచారణ జరిపి సరైన రికార్డులు లేని వాహనాలను సీజ్ చేయనున్నారు. గడచిన రెండు రోజుల్లో 168 సున్నిత ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించి రికార్డులు లేని 803 వాహనాలను సీజ్ చేశారు. 185 లీటర్ల ఐడీ మద్యం, 19.94 లీటర్ల మద్యం, 107 లీటర్ల నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం, 130 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు గుప్తా తెలిపారు. దీంతో పాటు ఇప్పటి వరకు 14 మందిని అరెస్టు చేశారు. కార్డన్, సెర్చ్ ఆపరేషన్‌లలో పోలీసులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Next Story