డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తోందని కొండకు వెళ్ళని వ్యక్తి జగన్
తిరుమల విశిష్ట గురించి జగన్ మాట్లాడటం ప్రజల కర్మ అని ఏపీ ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు
By Medi Samrat Published on 4 Oct 2024 5:45 PM ISTతిరుమల విశిష్టత గురించి జగన్ మాట్లాడటం ప్రజల కర్మ అని ఏపీ ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. తిరుమల వ్యవహారంలో సిట్ విచారణ త్వరలో ప్రారంభమవుతోందని అన్నారు. వెంకటేశ్వరస్వామి తనకు పునర్జన్మ ఇచ్చారని చంద్రబాబు అనేకసార్లు చెప్పిన విషయం జగన్ గుర్తుంచుకోవాలన్నారు. లీడర్, క్యాడర్ విడిచిపెట్టి పోతున్న నేపథ్యంలో ఆత్మరక్షణలో జగన్ విల విలలాడుతున్నాడని అన్నారు.
దేవుడిని నమ్ముతున్నానని జగన్ ఒక్క మాట ఎందుకు చెప్పలేకపోతున్నాడు.. డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తోందని కొండకు వెళ్ళని వ్యక్తి జగన్ అన్నారు. సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ తన అలోచనలను ప్రజల ముందుంచారని.. పపన్ కల్యాణ్ మంచి ఆలోచనలపై సమాజంలో చర్చ జరగాలన్నారు. తిరుమలలో ఉన్న పటిష్టమైన వ్యవస్థను జగన్ నాశనం చేశారన్నారు.
టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి తప్పు చేశారని ఆరోపించారు. సెట్టింగ్ లు వేసి తిరుమలేశ్వుడిని ఇంటికి రప్పించుకున్న వ్యక్తి జగన్.. పునాదులు కదిలాయి కాబట్టే.. ఇప్పుడు తిరుమల గురించి జగన్ మాట్లాడుతున్నాడు.. టీటీడీని అగౌరపర్చిన వారు దోషులుగా నిలబడే సమయం దగ్గరుంది అని అన్నారు. టీటీడీ పాలక మండలి కాదు.. టీటీడీ ధర్మకర్తల మండలి అని కూడా వైసీపీకి తెలియదన్నారు.
రాజకీయంగా ఉనికి కోసమే జగన్ మాట్లాడుతున్నారని.. ముఖ్యమంత్రిగా జగన్ కొండపై కమర్షియల్ యాక్టివిటీస్ చేశాడని ఆరోపించారు. 150 రూపాయల గదులను రెండు వేలకు పెంచారని అన్నారు. జగన్ హాయాంలో 250 కోట్ల టర్నోవర్ .. 150 కోట్లకు టర్నోవర్ కు తగ్గించారన్నారు. వాస్తవాలకు దూరంగా జగన్ మాట్లాడుతున్నాడు.. తాను చెప్పిందే మాత్రమే నిజమనే భావనలో జగన్ ఉన్నాడు.. జగన్ ను ఇంటికి పంపి వంద రోజులే అయింది. అప్పుడే ప్రజలు జగన్ మాట నమ్మరు.. ప్రజల్లో భ్రమను కల్పించే ప్రయత్నం జగన్ చేస్తున్నారని పయ్యావుల కేశవ్ అన్నారు.