పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఏపీ మంత్రి బృందం దుబాయ్ పర్యటన
ఏపీ మంత్రి నారాయణ దుబాయ్ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది.
By - Knakam Karthik |
పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఏపీ మంత్రి బృందం దుబాయ్ పర్యటన
అమరావతి: ఏపీ మంత్రి నారాయణ దుబాయ్ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం ఆయన బృందం దుబాయ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం అపరెల్ గ్రూప్ ఛైర్మన్ నీలేష్ వేద్‌తో మంత్రి నారాయణ సమావేశం అయ్యారు. కాగా ఈ అపరెల్ గ్రూప్ ఫ్యాషన్, ఫుట్‌వేర్ రంగాల్లో దాదాపు 14 దేశాల్లో ప్రసిద్ధి పొందింది. ఈ క్రమంలోనే ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా అపరెల్ గర్ఊప్ ప్రతినిధులను మంత్రి నారాయణ రాష్ట్రానికి ఆహ్వానించారు.
మరో వైప్ ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ చైర్మన్ రమేష్ రామకృష్ణన్‌తో కూడా మంత్రి నారాయణ భేటీ అయ్యారు. షిప్పింగ్,లాజిస్టిక్స్ రంగంలో దుబాయ్ కేంద్రంగా అనేక దేశాల్లో ట్రాన్స్ వరలడ్ గ్రూప్ తమ వ్యాపారాలు నిర్వహిస్తుంది. రాష్ట్రంలో లాజిస్టిక్స్ రంగం అభివృద్ధికి సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలను మంత్రి వివరించారు. కాగా ఏపీని లాజిస్టిక్ హబ్ గా మార్చేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఈ నెల 14,15 తేదీల్లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని ఆయా కంపెనీలను మంత్రి నారాయణ ఆహ్వానించారు.