11 సీట్లు ఎందుకు వచ్చాయో? ఆత్మపరిశీలన చేసుకోవాలి..జగన్‌పై మంత్రి లోకేశ్ ఫైర్

అహంకారానికి ప్యాంటు, షర్టు వేస్తే జగన్ లాగే ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు.

By Knakam Karthik  Published on  5 March 2025 5:03 PM IST
Andraprades News, Nara Lokesh, Ys Jagan, Cm Chandrababu, Pawan Kalyan

11 సీట్లు ఎందుకు వచ్చాయో? ఆత్మపరిశీలన చేసుకోవాలి..జగన్‌పై మంత్రి లోకేశ్ ఫైర్

అహంకారానికి ప్యాంటు, షర్టు వేస్తే జగన్ లాగే ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. జగన్ ఫ్రస్టేషన్‌లో ఉన్నాడని అర్థమవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు, అధికారం కోల్పోయాక కూడా ప్రజలకు దూరంగా బతుకుతున్నాడు. పరదాల ప్రభుత్వం పోయాక రాష్ట్రంలో పరదాల అమ్మకాలు తగ్గాయని విమర్శించారు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించారనే విషయంలో ఎందుకు అర్థం కావడంలేదు? సొంత తల్లి, చెల్లి తనని నమ్మడంలేదని ఇంకా ఎందుకు గ్రహించలేకపోతున్నాడు? తండ్రి శవాన్ని పక్కనపెట్టుకుని ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు చేసిన వ్యక్తి జగన్ ..అని మంత్రి లోకేశ్ అన్నారు.

ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుని కించపరిచేలా మాట్లాడతాడా? ఐదు సంవత్సరాలు ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించని జగన్‌కు..దానిపై మాట్లాడే హక్కు ఎక్కడిది? ఎందుకు 11 సీట్లు వచ్చాయో ఇప్పుడైనా ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు వచ్చిన మెజార్టీ ఎంత? జగన్‌కు వచ్చిన మెజార్టీ ఎంత? సీఎం, డిప్యూటీ సీఎంపై జగన్‌వి దిగజారుడు మాటలు..అని మంత్రి లోకేశ్‌ వ్యాఖ్యానించారు.

Next Story