అమరావతి: ఏపీ మంత్రి నారా లోకేశ్ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒక పెద్ద ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో తీసుకువచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలకు ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించినట్టు లోకేశ్ పేర్కొన్నారు.
ఆ ప్రతిష్టాత్మకమైన అవార్డు బలమైన, విశ్వసనీయమైన జ్యూరీ ద్వారా ఈ అవార్డు లభించందని అన్నారు. ఆ అవార్డు ఏంటి? దాని విజేత ఎవరు అన్న దానిపై ఈరోజు మధ్యాహ్నం తెలియజేస్తానని తెలిపారు. అయితే ఏ అవార్డు వచ్చింది? ఎవరికి వచ్చిందన్న దానిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ఉత్కంఠను అధికారుల్లో రేపినట్లయింది.