మంగళగిరిలో త్రిబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది: మంత్రి లోకేశ్
ఓడిన చోటే గెలవాలని ఆనాడే అనుకున్నట్లు ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
By Knakam Karthik
మంగళగిరిలో త్రిబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది: మంత్రి లోకేశ్
ఓడిన చోటే గెలవాలని ఆనాడే అనుకున్నట్లు ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. మంగళగిరి లో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం అదృష్టం గా భావిస్తున్నా. 2019 లో మంగళగిరి లో 5 వేల ఓట్ల తో ఓడిపోయా. ఆనాడే అనుకున్నా ఓడిన చోటే నేను గెలవాలని . మంగళగిరిలో చేనేత కార్మికుల సమస్యలు అన్ని తెలుసుకున్నా. చేనేత కార్మికుల ఆదాయం రెట్టింపు చేయాలని లక్ష్యం గా పెట్టుకున్నా. యువగళంలోనే చేనేతను దత్తత తీసుకున్నా. నేను ఎవరింటికి వెళ్ళినా వాళ్ళకు మంగళగిరి చీరలు ఇస్తున్నా. బ్రాహ్మణి కూడా మంగళ గిరి చీరలు కట్టింది. మంగళగిరి చేనేతలను మా గుండెల్లో పెట్టుకున్నాం..అని మంత్రి లోకేశ్ చెప్పారు.
53 వేల ఓట్లతో మెజారిటీ గెలిపించమని అడిగితే 90 వేల ఓట్లతో భారీ మెజారిటీ తో గెలిపించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంటే ..మంగళగిరిలో త్రిబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది. 1000 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇచ్చాం. 20 వేల ఇళ్ల పై సూర్య ఘర్ కింద సోలార్ పవర్ పెడతాం. 100 పడకల హాస్పటల్ కడుతున్నాం. 200 అభివృద్ధి పనులు మంగళ గిరి లో నడుస్తున్నాయి. చేనేతల నాయకుడు ప్రగడ కోటయ్య జయంతినీ అధికారికంగా నిర్వహించాలని కోరుతున్నా..అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.