డెడ్‌బాడీలను డోర్ డెలివరీ చేసింది ఎవరో అందరికీ తెలుసు: మంత్రి లోకేశ్
దళితుల పట్ల దారుణాలు చేసిన వారంతా కౌన్సిల్‌లోనే ఉన్నారు" అని మంత్రి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు.
By Knakam Karthik Published on 25 Feb 2025 2:30 PM IST
డెడ్‌బాడీలను డోర్ డెలివరీ చేసింది ఎవరో అందరికీ తెలుసు: మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గందరగోళం నెలకొంది. గవన్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వాడీవేడీ చర్చ జరిగింది. గవర్నర్ ప్రసంగంలో అన్నీ అసత్యాలు చెప్పారంటూ వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపించారు. దీనిపై మంత్రి నారా లోకేష్ అభ్యంతరం తెలిపారు. రాష్ట్రంలో దళితులపై దాడులు చేసింది ఎవరో అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో ఓ ఎమ్మెల్సీ దళితులకు గుండు కొట్టించారు. మరో ఎమ్మెల్సీ ఏకంగా ఓ డెడ్‌బాడీని డోర్ డెలీవరి చేశారు. దళితుల పట్ల దారుణాలు చేసిన వారంతా కౌన్సిల్‌లోనే ఉన్నారు" అని మంత్రి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇప్పుడు పెట్టుబడులు పెడితే ఉద్యోగాలు కల్పించేందుకు 2-3 సంవత్సరాలు పడుతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని గవర్నర్ ప్రసంగంలో తెలిపారు అని" మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా చెప్పారు. గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని నారా లోకేశ్ ఆరోపించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి షరతుల్లేకుండా మద్దతిచ్చాం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వానికి మద్దతిచ్చాం. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకువస్తున్నాం. అని" నారా లోకేశ్ స్పష్టం చేశారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న పులివెందుల ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు ఏం చేశారని నారా లోకేశ్ సెటైర్ వేశారు.