నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..త్వరలోనే ఆ ఖాళీలు భర్తీ చేస్తామని మంత్రి ప్రకటన

రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీపై మహిళా శిశు సంక్షేమ, గిరిజనశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు.

By Knakam Karthik
Published on : 7 April 2025 6:56 AM IST

Andrapradesh, Minister Gummadi Sandhya Rani, Ap Government, Unemployees, Grama Ward Sachivalayam Vacancies

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..త్వరలోనే ఆ ఖాళీలు భర్తీ చేస్తామని మంత్రి ప్రకటన

ఏపీలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీపై మహిళా శిశు సంక్షేమ, గిరిజనశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్నత చదువులు కలిగిన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించనున్నట్టుగా చెప్పారు.

అయితే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీలు భర్తీ చేయాలనే డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఖాళీలను భర్తీ చేయకపోవడం ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులపై అదనపు భారం పడుతుందనే వాదన కూడా ఉంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీలు ఎక్కువగా ఉండటంతో మిగిలిన ఉద్యోగులపై భారం పడుతోందని, అయితే ఈ భారాన్ని తగ్గిస్తామన్నారు. అందుకోసం ఖాళీల భర్తీ చేపట్టనున్నట్టుగా చెప్పారు. ప్రస్తుతం ఉన్న అద్దె భవనాల స్థానంలో నూతన భవనాలు నిర్మిస్తామని కూడా తెలిపారు.

Next Story