అందుకే చిత్తుగా ఓడించారు..జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్
గుంటూరు మిర్చి యార్డ్‌కు వెళ్లిన జగన్ అబద్ధాలు మాట్లాడారు అని మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు.
By Knakam Karthik
అందుకే చిత్తుగా ఓడించారు..జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్
వైసీపీ అధినేత జగన్ నిజమైన నాయకుడు అయితే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన పని చేయాలని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు మిర్చి యార్డ్‌కు వెళ్లిన జగన్ అబద్ధాలు మాట్లాడారు అని మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. 150 సీట్లతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి.. ఐదేళ్లు ప్యాలెస్‌లకే పరిమితం అయ్యారని విమర్శించారు. ప్రతిపక్షాలు, మీడియా ఎంత ఘోషించినా ఐదేళ్లూ ప్యాలెస్లు వీడలేదన్నారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండొద్దనే ఈ ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారన్నారు. జగన్ మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి బాగాలేదనిపిస్తోందన్నారు. జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో 70 శాతం ప్రజలను ప్రభావితం చేసే శాఖలను ఐదేళ్లు జగన్ తాళం వేశాడని ఆరోపించారు. ప్రస్తుతం వ్యవసాయ, వాటి అనుబంధ శాఖలపై 60-70 శాతం మంది ఆధారాపడినట్లు చెప్పారు. గత ఐదేళ్లలో రైతు గురించి ఇది చేసాను అని చెప్పగలవా జగన్ అని.. మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ చేశారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చి యార్డ్‌కు వెళ్లకుండా జగన్‌ను ఎవరూ అడ్డుకోలేదని ఎన్నికల కోడ్ ఉండగా వెళ్లారని చెప్పారు. జరిగిన ఉల్లంఘనపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుంది. అని మంత్రి అచ్చెన్న చెప్పారు.