ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఏపీ లాసెట్, ఏపీ పీజీ లాసెట్– 2024 పరీక్షలను ఈరోజూ మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశామని కన్వీనర్ ఆచార్య బి.సత్యనారాయణ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులను జూన్ 9న మధ్యాహ్నం 1.00 నుంచి 2.30 గంటల వరకు అనుమతిస్తామన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు.
మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సులకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీ లాసెట్‌లో సాధించిన ర్యాంక్ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లా కళాశాలల్లో ప్రవేశాలు దక్కుతాయి. పరీక్ష కేంద్రానికి హాల్‌టికెట్ తోపాటు ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. పరీక్ష నిర్వహణ కోసం 105 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీ లాసెట్‌కు పురుషులు 15,374 మంది, మహిళలు 8,051 మంది దరఖాస్తు చేసుకున్నారు.