విద్యార్థులకు అలర్ట్‌.. ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షల షెడ్యూల్‌ రిలీజ్‌

AP Inter Practical Exams schedule. ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌. ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 16 నుండి ఏప్రిల్‌ 7 వరకు

By అంజి  Published on  14 March 2022 8:45 AM IST
విద్యార్థులకు అలర్ట్‌.. ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షల షెడ్యూల్‌ రిలీజ్‌

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌. ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 16 నుండి ఏప్రిల్‌ 7 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డ్‌ తెలిపింది. ఈ మేరకు ఆదివారం నాడు బోర్డ్‌ కార్యదర్శి శేషగిరి బాబు వెల్లడించారు. నాన్‌ జంబ్లింగ్‌ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు తాము చదివిన కాలేజీలోనే పరీక్షలు రాసుకోవచ్చు. సెకండ్‌ఇయర్‌ విద్యార్థులందరూ కూడా రేపటి నుండి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. ఇంటర్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ bie.ap.gov.in హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే ఇంటర్‌ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 11 నుండే జంబ్లింగ్‌ విధానంలో ప్రారంభం కావాల్సి ఉండగా.. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇంటర్‌ బోర్డు కొత్తగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. అంతకుముందు నాన్‌ - జంబ్లింగ్‌ విధానంలో ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్విహిస్తామంటూ చెప్పుకొచ్చిన ఇంటర్‌ బోర్డు.. మార్చి 3న జంబ్లింగ్‌ విధానంలో ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తామని ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. గురువారం నాడు ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. చివరి దశలో పరీక్షల నిర్వహణ విధానాన్ని మార్చడం సరైంది కాదని, నాన్‌ - జంబ్లింగ్‌ విధానంలోనే పరీక్షలు కొనసాగించేలా ఆదేశాలు జారీ చేసింది.

Next Story