ఒంటి మీద ఖాకీ చొక్కా పడాలంటే ఎంత కష్టపడాలో తెలుసా జగన్?: అనిత
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్‌పై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik
ఒంటి మీద ఖాకీ చొక్కా పడాలంటే ఎంత కష్టపడాలో తెలుసా జగన్?: అనిత
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్‌పై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల బట్టలూడదీస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన జగన్ శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని సీరియస్ అయ్యారు. వైసీపీ హయాంలో ఐపీసీ సెక్షన్ ప్రకారం కాకుండా.. వైసీపీ సెక్షన్ ప్రకారం పోలీసులు పని చేశారని ఆరోపించారు. కానీ తమ కూటమి ప్రభుత్వంలో చట్ట ప్రకారమే నడుచుకుంటారని చెప్పారు. జగన్ మాటలు వింటే, ఇదంతా క్రిమినల్ లీడర్ ప్రీ ప్లాన్ అని, ఇలా కూడా ఆలోచన చేస్తారా అనిపించిందన్నారు. జగన్ మాట్లాడుతుంటే వారి ఐదేళ్ల అరాచక పాలన గుర్తుకు వచ్చింది..అని హోంమంత్రి అనిత ఎద్దేవా చేశారు.
చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన జనాలు మర్చిపోలేదు. ముసుగులేసుకుని కస్టోడీయల్ టార్చర్ ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా? ఇలాంటి సంస్కృతి మాది కాదు. ఇప్పటి సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, హోంమంత్రి అనేక కేసులు ఉన్నాయి. ఇవన్నీ ప్రశ్నించడంతో వల్ల పెట్టారు. ఊడదీయడానికి CMR షాప్ నుంచి కొని తెచ్చుకోవడంతో వచ్చింది కాదు పోలీసు యునిఫాం అన్నారు. వైసీపీ హయాంలో 2800 పై చిలుకు హత్యలు జరిగాయి. ఇలా ప్రవర్తిస్తేనే 151 నుంచి 11కి దిగిపోయావు నువ్వు. ఇకనైనా మారకపోతే అవి కూడా రావని..అనిత విమర్శించారు.
ఒంటి మీద ఖాకీ చొక్కా పడాలంటే ఎంత కష్టపడాలో తెలుసా జగన్ ? మహిళా ఎస్పీని బట్టలు ఊడదీస్తా అంటావా ? #PsychoFekuJagan #EndOfYCP#AndhraPradesh pic.twitter.com/a5sn0Ym2XV
— Telugu Desam Party (@JaiTDP) April 9, 2025