దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని కనీసం పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేదు..అని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వైసీపీని విమర్శించారు. మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు అభ్యంతరకరం. ఆయన కూడా మంత్రిగా చేశారు. అలాంటిది సీఎం చంద్రబాబు గురించి అలా మాట్లాడతారా? నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం..అని హోంమంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు.
రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు కృషి చేస్తున్నాం..
గతంలో ఏపీ గంజాయికి హబ్‌గా ఉండేది..అని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి దోరికినా దాని మూలాలు ఏపిలో ఉన్నాయి అని చెప్పేవారు. అయితే గత ఏడాది కాలంగా మేము చేసిన కృషి కారణంగా రాష్ట్రంలో గంజాయిని నియంత్రించగలిగాం. ఈగల్ అనే పేరును ముఖ్యమంత్రి స్వయంగా ప్రతిపాదించారు. ఈగల్ స్ధాపించినప్పటి నుండి రవి కృష్ణ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఈగల్ టీంలో వైజాగ్ , విజయవాడ, రాజ మండ్రిలో మూడు టీంలు పెట్టుకొని పర్యవేక్షించాం. ఏజెన్సి నుండి వచ్చే రూట్లలో సిసి కెమెరాలు, చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. ఈ రోజుకు 831 గంజాయి కేసులు నమోదు అయ్యాయి. పాడేరులో ప్రత్యామ్నాయ పంటలు పెంచేందుకు వెళితే గత ప్రభుత్వంలో గంజా ఆయిల్ తయారు చేయడానికి మిషన్లు పని చేసేవి అని చెప్పారు. గత ప్రభుత్వంలో స్కూలు బ్యాగుల్లోకి గంజా ప్యాకెట్ లు వెళ్లిపోయాయి. నాటి నుండి నేటి వరకూ ఒక యజ్జం తరహలో గంజా నిర్మూలనకు పనిచేస్తున్నాం. ఈగల్ టీంలు రోజుకు ఒక్కచోట అయినా క్లాస్ లు ఏర్పాటు చేశాము. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని ఈగల్ టీం ప్రారంభించింది...అని హోంమంత్రి తెలిపారు.