జగన్‌కు కనీసం ఒక్క చెల్లి కూడా రాఖీ కట్టలేదు ఎందుకు?: హోంమంత్రి అనిత

గతంలో ఎన్నడూ లేని విధంగా కడప జిల్లాలో జడ్పీటీసీ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని..ఏపీ హోంమంత్రి అనిత అన్నారు.

By Knakam Karthik
Published on : 11 Aug 2025 5:54 PM IST

Andrapradesh, Home Minister Anitha, Ysrcp, Jagan, Tdp

జగన్‌కు కనీసం ఒక్క చెల్లి కూడా రాఖీ కట్టలేదు ఎందుకు?: హోంమంత్రి అనిత

గతంలో ఎన్నడూ లేని విధంగా కడప జిల్లాలో జడ్పీటీసీ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని..ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. విలువలు పాటించని జగన్ విలువలు గురించి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో కూటమి ప్రభుత్వం కడపలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తుంది. గతంలో పులివెందులలో ఎప్పుడు ఏకగ్రీవంగా జరిగేవి. ప్రజాస్వామ్య బద్దంగా ఈనాడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్య పద్దతిలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి పులివెందుల ప్రజలను కోరుతున్నా. తల్లి, చెల్లి ఆస్తుల కోసం కోర్టుకి ఎక్కిన వ్యక్తి జగన్. ఎన్నికలు ప్రశాంతంగా జరగకుండా గతంలో భయపెట్టి ఏకగ్రీవం చేసుకున్నారు. ఎలక్షన్ గైడ్‌లైన్స్ ప్రకారం పోలింగ్ బూత్‌లు ఉంటాయి. అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. పులివెందులలో ఓడిపోతామనే భయంతో నిందలు వేస్తున్నారు. పోలింగ్ బూతులు మార్చారు, ఓట్ల స్లిప్పులు మార్చారని భయంతో మాట్లాడుతున్నారు. ఎలక్షన్ సజావుగా జరగాలని అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది..మంత్రి అనిత అన్నారు.

హెల్ప్ డెస్క్, ఓటర్లకి వెహికల్స్ ఉంచటం , పోలీస్ బందోబస్త్ నిర్వహించటం జరుగుతుంది. పులివెందుల ఎలక్షన్‌లో అవినాష్ రెడ్డి, జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఓటర్ స్లిప్‌లు పంపిణీ 100 శాతం పూర్తి చేశారు. పచ్చ కామెర్ల వాళ్ళకి లోకం అంత పచ్చగానే కనిపిస్తున్న మాదిరి జగన్ కి అలాగే కనిపిస్తాయి. ఒక్క పులివెందుల లోనే 11 నామినేషన్ లు వచ్చాయి. ఎక్కడ అవకతవకలు జరగకుండా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉప ఎన్నికలు సజావుగా జరుగుతాయి. దొంగ ఓట్లను తెచ్చేది, ఓటర్లను భయపెట్టేది,రీసైక్లింగ్ కు పాల్పడేది వైసీపీ. ఎక్కడా ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండటానికి ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారమే పోలీసులు పోలింగ్ బూత్‌లను మారుస్తున్నారు. పట్టభద్రుల ఎన్నిక ల సమయం లో 10వ తరగతి చదువు తున్న విద్యార్థులతో ఓట్లు వేయించిన ఘనత గత ప్రభుత్వానిదే. రాఖీ పండగ రోజు వైసీపీ అధినేతకు కనీసం ఒక్క చెల్లీ కూడా రాఖీ కట్టలేదు ఎందుకని? అవినాష్ రెడ్డి కూడా చదువు కున్న వ్యక్తి , సీఎం గా పనిచేసిన జగన్‌కు , ఎంపీ గా పని చేసిన అవినాష్‌కు ఎన్నికల సంఘం విధులు తెలపాలా? జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నామినేషన్‌లను కూడా వేయకుండా అడ్డుకుని చించి వేసిన చరిత్ర వారిది. తమ ప్రభుత్వం లో పులివెందుల లో తొలిసారి 11 నామినేషన్లు పడ్డాయంటే కూటమి ప్రభుత్వం ఎంత పార దర్శకంగా ఉందో అర్థం అవుతుంది. పులివెందులలో వైసీపీ ఓడి పోతుంది కాబట్టి అంత హడావుడి చేస్తోంది. దాడులు, దౌర్జన్యాలు వైసీపీ డిఎన్ఏ లోనే ఉంది. పులివెందులలో ఓటమి భయం వైసీపీ కి పట్టుకుంది. 11సీట్లకు పడిపోతే ఈవీఎంలపై మీద నెపం పెట్టారు. వైసీపీ మాదిరి దొంగ ఓట్లు చేర్చలేదు. సొంత చెల్లి సునీత న్యాయం కోసం పోరాటం చేస్తుంది. వాళ్ళ అన్నయ్య అధికారంలో ఉండి కూడా సొంత బాబాయ్ హత్య కేసు ఇన్వెస్టిగేషన్ చేపించలేకపోయారు. సొంత మనుషులే ఇంత పని చేసినందుకే సునీతకి బాధ ఉంది..అని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.

Next Story