జీఓ నెం.1 పై సస్పెన్షన్‌ విధించిన ఏపీ హైకోర్టు

AP High Court suspends GO 1 over restrictions on rallies till January 23. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ జనవరి

By అంజి  Published on  12 Jan 2023 2:01 PM GMT
జీఓ నెం.1 పై సస్పెన్షన్‌ విధించిన ఏపీ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ జనవరి 23 వరకు జీఓ నెం1 ను సస్పెండ్ చేస్తూ జనవరి 20లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజకీయ పార్టీలు ర్యాలీలు, బహిరంగ సభలు, రోడ్ షోలపై ఆంక్షలు విధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. గుంటూరు, కందుకూరులో ఇటీవల జరిగిన రెండు ఘటనల్లో పదకొండు మంది మరణించారు. జీఓ నెం.1పై సీపీఐ ఏపీ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకష్ణ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రజల ప్రాథమిక హక్కును హరించేలా జీవో ఉందని తన పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.

రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరాములు వాదనలు వినిపించారు. రామకృష్ణ ఇచ్చిన ఈ పిల్‌పై ప్రభుత్వం వద్ద ఎలాంటి సమాచారం లేదని పేర్కొంటూ, నిబంధనల ప్రకారం ఈ కేసును రోస్టర్‌లో చేర్చలేమని అడ్వకేట్ జనరల్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన పిటిషన్లను వెకేషన్ బెంచ్ విచారించకూడదని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదించారు. రామకృష్ణ తరపున అశ్వినీ కుమార్ వాదనలను వినిపించారు. ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని ఆయన వాదించారు. బ్రిటిష్‌ కాలంనాటి చట్టాన్ని తీసుకొచ్చారని, అప్పుడు కూడా లేని రూల్స్‌ ఇప్పుడు విధించారని చెప్పారు. కాగా ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు జనవరి 23కు వాయిదా వేసింది.

పోలీసు చట్టం 1861లోని సెక్షన్ 30 ప్రకారం.. పబ్లిక్ రోడ్లు, వీధుల్లో బహిరంగ సభ నిర్వహించే హక్కు నియంత్రణకు సంబంధించిన అంశం అని ప్రిన్సిపల్ సెక్రటరీ (హోం) హరీష్ కుమార్ గుప్తా జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు పేర్కొంది. అరుదైన, అసాధారణమైన పరిస్థితులలో మాత్రమే, బహిరంగ సమావేశాలకు అనుమతి పరిగణించబడుతుంది. జీవో ప్రకారం.. ట్రాఫిక్‌కు, ప్రజల రాకపోకలకు, అత్యవసర సేవలకు, నిత్యావసర వస్తువుల తరలింపుకు అంతరాయం కలిగించని బహిరంగ సభల నిర్వహణ కోసం పబ్లిక్ రోడ్లకు దూరంగా "నిర్దేశించిన స్థలాలను" గుర్తించాలని పోలీసులను ఆదేశించారు. తమ పార్టీ సమావేశాలకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని, జీవో పాస్‌పై టీడీపీ నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడటం గమనార్హం. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జనవరి 27 నుంచి కుప్పం నుంచి 400 రోజుల పాదయాత్ర యువ ​​గళంకు సిద్ధమయ్యారు.

Next Story