క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి పి.వి.సునీల్ కుమార్ ను విధుల నుండి తొలగించింది. ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా అనేక విదేశీ పర్యటనలు చేశారనే ఆరోపణలపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధించిన కేసులో సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై అభియోగాలు ఉన్నాయి. 2020 నుంచి 2024 మధ్య ప్రభుత్వ అనుమతి లేకుండా పలుమార్లు విదేశాలకు వెళ్లి ఆలిండియా సర్వీసు నిబంధనలను సునీల్‌కుమార్ ఉల్లంఘించారని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై విచారణ జరిపించింది. ఇప్పుడు సునీల్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.