లోన్ యాప్‌ల వేధింపులను నిరోధించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులకు సంబంధించిన ఫిర్యాదుల కోసం హోం మంత్రిత్వ శాఖ అధికారులు సోమవారం టోల్ ఫ్రీ నంబర్ 1930ని విడుదల చేశారు. ఈ సందర్భంగా లోన్ యాప్స్ వేధింపులపై 1930కి ఫిర్యాదు చేయాలని హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేయడంతో పాటు గుర్తు తెలియని వ్యక్తులకు బ్యాంకు వివరాలు, ఫొటోలు ఇవ్వవద్దని హెచ్చరించింది.
ఇన్‌స్టంట్ లోన్ యాప్‌లు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. వారి బెదిరింపులు, లోన్ యాప్ ఏజెంట్ల వేధింపుల కారణంగా చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం లోన్ యాప్ ల దారుణాలపై దృష్టి సారించి ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ ఏర్పాటు చేసింది.