అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సమగ్ర విద్యా అనుభవాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ డౌట్ క్లియరెన్స్ బాట్ (యాప్)ను ప్రారంభించనున్నట్లు బుధవారం ఒక అధికారి తెలిపారు. ConveGenius డెవలప్ చేసిన ఈ బాట్ భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, గణితం, ఇంగ్లీష్, టోఫెల్ ప్రిపరేషన్ విభాగాల్లో పాఠశాల సమయం దాటి సందేహాలను నివృత్తి చేయడానికి ఉద్దేశించబడింది.
"డౌట్ క్లియరెన్స్ బాట్ అప్లికేషన్ ఉపాధ్యాయులు, విద్యార్థులకు పంపిణీ చేయబడిన అన్ని టాబ్లెట్‌లు (ట్యాబ్‌లు), ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్‌లలో ఇన్‌స్టాల్ చేయబడుతుంది" అని ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ప్రభుత్వ ఉత్తర్వులో తెలిపారు. సెప్టెంబర్ 2024 వరకు కన్వీజీనియస్ ఈ బోట్‌ను ఉచితంగా అందజేస్తుందని ప్రకాష్ తెలిపారు.
ఇదిలా ఉంటే.. అన్ని స్థాయిల్లో పాఠ్య పుస్తకాలను డిజిటల్ పీడీఎఫ్ రూపంలో ఆన్‌లైన్‌లో ఉంచడంతో పాటు బైజూస్ కంటెంట్‌తో ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లను ఉచితంగా ఇచ్చింది ప్రభుత్వం. అలాగే 6 నుంచి 10 వరకు తరగతి గదుల్లో 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్‌పీ), ఎలిమెంటరీ పాఠశాలల్లో 10,038 స్మార్ట్ టీవీలతో డిజిటల్ బోధనను అందుబాటులోకి తేచ్చింది.