కోవిడ్‌ మృతులకు కుటుంబాలకు పరిహారం.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!

AP Govt orders covid death compensation. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి

By అంజి  Published on  26 Oct 2021 12:42 PM IST
కోవిడ్‌ మృతులకు కుటుంబాలకు పరిహారం.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!
  • కోవిడ్‌ మృతులకు కుటుంబాలకు రూ.50 వేలు పరిహారం
  • పరిహారం చెల్లింపుపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు పరహారం చెల్లింపుపై ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం చెల్లింపు గురించి ఉత్తర్వుల్లో పేర్కొంది. పరిహారాన్ని విపత్తు నిర్వహణ నిధి నుండి బాధిత కుటుంబాలకు చెల్లించనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆరోగ్యశాఖ ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు డీఆర్‌వో నేతృత్వంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా బాధిత కుటుంబాలకు రెండు వారాల్లో పరిహారం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే మృతుల కుటుంబ సభ్యుల నుండి అప్లికేషన్‌లు స్వీకరించాలని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల నేపథ్యంలో కొవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించనున్నారు.

Next Story