ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 'జగనన్న గోరుముద్ద' పథకంలో మార్పులు

AP govt makes changes to Jagananna Gorumudda regarding distribution of eggs. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందించే పౌష్టికాహారం నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ, ఎప్పటికప్పుడు

By అంజి  Published on  25 Oct 2022 9:16 AM GMT
ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. జగనన్న గోరుముద్ద పథకంలో మార్పులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందించే పౌష్టికాహారం నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ, ఎప్పటికప్పుడు పథకాన్ని పర్యవేక్షిస్తూ అవసరమైన మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు 10 రోజులకు ఒకసారి చొప్పున నెలకు మూడుసార్లు పాఠశాలలకు కోడి గుడ్లను సరఫరా చేసేవారు. అయితే దీని వల్ల కోడి గుడ్ల నాణ్యత దెబ్బతింటుందని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే సరఫరాలో మార్పులు చేసి ఆదేశాలు జారీ చేసింది. గుడ్ల నాణ్యత దెబ్బతినకుండా వారానికోసారి తాజా గుడ్లను సరఫరా చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం జగనన్న గోరుముద్ద పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు వారానికి ఐదు ఉడికించిన గుడ్లను మధ్యాహ్న భోజనంగా అందజేస్తున్నారు. కోడి గుడ్లు ప్రతి వారం వివిధ రంగులతో సరఫరా చేయబడుతున్నాయి. తద్వారా నాణ్యమైన గుడ్లు పంపిణీ చేయబడతాయి. గుడ్లు వరుసగా నెలలో మొదటి వారం నీలం రంగులో, 2వ వారం గులాబీ రంగులో, 3వ వారానికి ఆకుపచ్చ రంగులో, 4వ వారంలో వైలెట్ రంగులో ఉంటాయి. పాఠశాలల్లో ఈ విధంగా వచ్చే గుడ్లనే ప్రధానోపాధ్యాయులు దిగుమతి చేసుకోవాలి. గుడ్ల సైజు తగ్గినా పాఠశాలల్లో గుడ్లు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం పర్యవేక్షణ పెంచింది. పాఠశాల స్థాయిలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీలు, గ్రామ, వార్డు సచివాలయ సంక్షేమ సహాయకులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కోడి గుడ్ల సరఫరాకు ఆమోదం పొందిన కాంట్రాక్ట్ ఏజెన్సీ నుంచి ఐఎంఎంఎస్ యాప్‌లో గుడ్ల సైజు, రంగు స్టాంపింగ్ ఉన్న గుడ్లు, స్టాంపింగ్ లేని గుడ్లు తదితర వివరాలను నమోదు చేయాలని నిబంధన పెట్టారు. విద్యార్థులకు అందించే నాణ్యమైన పౌష్టికాహారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా నాణ్యమైన గుడ్లు సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్లు చర్యలు చేపట్టారు.

Next Story