ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు ఫ్రీ అడ్మిషన్లు.. ఈ నెల 16 నుంచే దరఖాస్తులు

AP Govt implements RTE in all private schools. పేద విద్యార్థుల చదువు కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్‌ స్కూళ్లలో

By అంజి  Published on  5 Aug 2022 5:08 AM GMT
ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు ఫ్రీ అడ్మిషన్లు.. ఈ నెల 16 నుంచే దరఖాస్తులు

పేద విద్యార్థుల చదువు కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్‌ స్కూళ్లలో 25 శాతం సీట్లను పేద విద్యార్థులతో భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఈ విద్యా సంవత్సరం నుంచే సీట్ల భర్తీ ప్రక్రియ అమల్లోకి వస్తుందని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఆగస్టు 10న స్కూళ్లలో ప్రవేశాల కోసం ప్రకటన రిలీజ్‌ కానుంది. ఒకటో తరగతిలో తమ పిల్లలను జాయిన్‌ చేయాలనుకునే పేద తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా స్కూళ్లలో సీట్ల లభ్యతను బట్టి విద్యార్థులకు లాటరీ పద్ధతిలో సీట్లు కేటాయిస్తారు.

ఈ స్కీమ్‌కు అప్లై చేసుకునే స్టూడెంట్స్‌.. ఇంటికి కిలోమీటరు దూరంలో ఉన్న స్కూల్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో స్కూల్‌ను ఎంచుకున్న తర్వాత లభ్యతను బట్టి లాటరీలో అడ్మిషన్‌ ఇస్తారు. స్కూళ్లలో ఖాళీలు ఉంటే 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న విద్యా సంస్థల్లో కూడా అడ్మిషన్లు కల్పిస్తారు. సీబీఎస్‌ఈ స్కూళ్లలో అడ్మిషన్లు ముగియడంతో.. వచ్చే ఏడాది అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ ముందే విడుదల చేస్తామని విద్యాశాఖ ప్రకటించింది.

ప్రైవేట్ అన్‌ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం కింద అడ్మిషన్లు ఇస్తారు. ఒక్కో విద్యార్ధికి ప్రభుత్వం రూ.15,538 ఫీజుగా చెల్లిస్తుంది. ఈ నెల 16 నుంచి ఆన్‌లైన్‌ పోర్టల్‌ అందుబాటులోకి వస్తుంది. ఈ నెల 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 30న లాటరీ పద్ధతిలో విద్యార్థులను ప్రవేశాలకు ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను సెప్టెంబరు 2న విడుదల చేస్తారు. అదే రోజు నుంచి 9వ తేదీ వరకు అడ్మిషన్లు ఉంటాయి. రెండో విడత ఎంపిక సెప్టెంబర్ 12-30 మధ్య నిర్వహిస్తారు.

Next Story