అమరావతి: మొంథా తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం కోస్తా జిల్లాల్లోని 26 తీర ప్రాంత గ్రామాల్లో ప్రయోగాత్మకంగా తుఫాన్ హెచ్చరికలను రియల్ టైమ్ వాయిస్ అలర్టుల రూపంలో అందిస్తోంది. కరెంట్ పోయినా 360 డిగ్రీల హార్న్ స్పీకర్ వ్యవస్థ కిలోమీటరు పరిధిలో హెచ్చరికలు అందిస్తుంది. ప్రజలను మెసేజెస్, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ కాల్స్, టాంటాంలు, క్షేత్రస్థాయిలో అధికారుల ద్వారానూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది.
''తుపాను సమాచారాన్ని ప్రజలకు వివిధ రూపాల్లో అందించాలన్న సీఎం ఆదేశాల మేరకు కోస్తా జిల్లాల్లోని 26 తీరప్రాంత గ్రామాల్లో ప్రయోగాత్మకంగా మొంథా తుపాన్ హెచ్చరికలు రియల్‌టైమ్ వాయిస్ అలర్ట్‌లను క్షణాల్లో అందిస్తున్నారు. విద్యుత్ అంతరాయం జరిగినా 360° హార్న్ స్పీకర్ వ్యవస్థ, ఒక కిలోమీటరు పరిధిలో కూడా స్పష్టమైన హెచ్చరికలను అందిస్తుంది. ఈ వ్యవస్థ మరిన్ని గ్రామాల్లో విస్తరించునున్నారు. ప్రజలకు మెసేజెస్, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ కాల్స్, టాంటాంలు, క్షేత్రస్థాయిలో అధికారుల ద్వారా,అన్ని విధాలా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు'' అని తెలుపుతూ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎక్స్ పోస్ట్‌లో తెలిపింది.