Andhrapradesh: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌

పోలీస్ శాఖలో నియామకాలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ నియాకాలను పూర్తి చేస్తామని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు తాజాగా ప్రకటన విడుదల చేసింది.

By అంజి  Published on  21 Nov 2024 10:15 AM IST
AP Govt, Constable Candidates, slprb, APnews

Andhrapradesh: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌

అమరావతి: పోలీస్ శాఖలో నియామకాలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ నియాకాలను పూర్తి చేస్తామని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఎస్‌సీటీ పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు స్టేజ్‌-2 దరఖాస్తు గడువును మరో వారం రోజులు పొడిగించారు. ఈ మేరకు ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. https://slprb.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి స్టేజ్ 2 అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు 9441450639, 9100203323 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.

కాగా ఈ ఏడాది డిసెంబరు చివరి వారంలో ఫిజికల్‌ టెస్టులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ తెలిపింది. ఇదే విషయంపై ఇటీవల ప్రకటన విడుదల చేసింది. 2022 న‌వంబ‌ర్ 28న పోలీస్ కానిస్టేబుల్స్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చింది. ప్రిలిమ్స్ ప‌రీక్ష 2023 జ‌న‌వ‌రి 22న జ‌రిగింది. ప్రిలిమ్స్ ప‌రీక్ష‌కు రాష్ట్ర వ్యాప్తంగా 4,58,219 మంది హాజ‌రయ్యారు. ఫిబ్ర‌వ‌రి 5న ప‌రీక్షా ఫ‌లితాలు విడుద‌లయ్యాయి. మొత్తం 95,208 మంది అభ్య‌ర్థులు క్వాలిఫై అయ్యారు. వీరికి దేహ‌దారుఢ్య‌, శారీర‌క సామ‌ర్థ్య (పీఎంటీ, పీఈటీ) ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సి ఉంది.

Next Story