అమరావతి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. గతంలో వారు సమ్మె చేసిన కాలాన్ని డ్యూటీ పీరియడ్‌గా పరిగణిస్తూ ప్రభుత్వం జీతాలు విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సీఎం చంద్రబాబు, మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు పీహెచ్‌సీ డాక్టర్ల సంఘం ధన్యవాదాలు తెలిపింది. కాగా సెప్టెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా పీడీ అడ్మిషన్లలో జీవో 85ను వ్యతిరేకిస్తూ వారంతా 10 రోజుల పాటు ఆందోళనలు చేశారు.
అటు 2025 - 26 విద్యా సంవత్సరం నుంచి పీజీ వైద్య విద్యలో 100 శాతం సీట్లను రాష్ట్ర విద్యార్థులతోనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పొరుగు రాష్ట్రాల విద్యార్థులు స్థానికేతర కోటాలో ఎంబీబీఎస్ పూర్తి చేస్తే.. స్థానిక విద్యార్థులుగానే గుర్తించి, పీజీ వైద్య విద్యలో 2023 - 24 వరకు ప్రవేశాలు కల్పించారు. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సూత్రపాయంగా నిర్ణయించింది.