ప్రభుత్వ ఉద్యోగుల సంక్రాంతి సెలవుల్లో మార్పులు చేసిన ఏపీ ప్ర‌భుత్వం

AP Govt Changes Sankranthi Holidays For Employees. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు కీలక విషయం. ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్

By Medi Samrat  Published on  11 Jan 2022 7:09 PM IST
ప్రభుత్వ ఉద్యోగుల సంక్రాంతి సెలవుల్లో మార్పులు చేసిన ఏపీ ప్ర‌భుత్వం

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు కీలక విషయం. ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సెలవుల్లో మార్పులను చేస్తూ నిర్ణయం తీసుకుంది. జనవరి 14, 15, 16 తేదీల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులను ప్రభుత్వం అంతకు ముందు నిర్ణయించగా.. ఇప్పుడు 13, 14, 15 తేదీలుగా నిర్ణయాన్ని తెలిపింది. తాజా ఉత్తర్వుల ద్వారా ఉద్యోగులు 16 వ తేదీ ఆదివారం నాడు కూడా ఇంటి దగ్గరే ఉండవచ్చు.

మరో వైపు సంక్రాంతి పండుగ నేపథ్యంలో నైట్‌ కర్ఫ్యూ అమలులో ఏపీ ప్రభుత్వం కీలక మార్పు చేసింది. సంక్రాంతి పండుగ తర్వాత నైట్‌ కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఈ నెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కర్ఫ్యూపై ఇచ్చిన ఉత్తర్వుల్లో​ ప్రభుత్వం సవరణ చేసింది. సోమ‌వారం రాత్రి నుంచే రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు జీవో ఇచ్చినా ఆ తర్వాత మార్పులు చేసింది. సంక్రాంతి తర్వాతే రాత్రి కర్ఫ్యూ విధించనున్నట్లు స్పష్టం చేసింది.ఈ మేర‌కు తొలుత జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను స‌వ‌రించి తాజాగా జీవో జారీ చేసింది. సంక్రాంతి త‌రువాత అంటే జ‌న‌వ‌రి 18 నుంచి 31 వ‌ర‌కు రాత్రి క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంటుంద‌ని తెలిపింది. రాత్రి 11 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ విధించ‌నున్న‌ట్లు తెలిపింది.

ఏపీలోని పాఠశాలలకు జనవరి 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. మళ్లీ 17 న పాఠశాలలు పున:ప్రారంభం అవ్వనున్నాయి. కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ భయం కారణంగా సంక్రాంతి సెలవుల తరువాత స్కూళ్లు తెరవడం చాలా కష్టంగా మారుతోంది. ఈనెల 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తూ ఇంటర్మీడియట్ ఏపీ బోర్డు కూడా ఉత్తర్వులు విడుదల చేసింది.


Next Story