ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు
AP Govt celebrating Andhrapradesh incarnation day ceremony. అమరావతి: మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ
By అంజి Published on 1 Nov 2022 11:32 AM ISTఅమరావతి: మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం రాజ్‌భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ, పేదల సంక్షేమానికి శ్రీకారం చుట్టి అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని చివరి మనిషికి అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రజాకేంద్రీకృత విధానాన్ని కొనసాగించాలని ఆ ప్రకటనలో గవర్నర్ ఆకాంక్షించారు. ఏ ప్రభుత్వమైనా విజయం సాధించాలంటే.. ప్రజల ఆనందమే బారోమీటర్ అని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అన్ని కార్యక్రమాలు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు గవర్నర్ తెలిపారు.
మన సంస్కృతిని- మన కీర్తిని, మన పూర్వీకుల పోరాటాలను- విజయాలను, ఈ నేల పై జన్మించిన ఎందరో మహానుభావుల త్యాగాలను ఘనంగా స్మరించుకునే పండుగ రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం.
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 1, 2022
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1వ తేదీ నుండి నిర్వహించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2020 లో ఏపీప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు నిర్వహించేవారు.