ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు దసరా సెలవులను ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6 వరకు దసరా సెలవులు ఉంటాయని తెలిపింది. మరోవైపు క్రిస్టియన్, మైనారిటీ పాఠశాలలకు అక్టోబర్ 1 నుంచి 6వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. 7వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 220 దినాలు పాఠశాలలు నడుస్తాయి. 80 రోజులు పాఠశాలలకు సెలవులు ఉంటాయి.
తెలంగాణలో కూడా పాఠశాలలకు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. ఈ నెల 25, అక్టోబర్ 9న ఆదివారాలు కావడంతో మొత్తం 15 రోజుల పాటు సెలవులు కొనసాగనున్నాయి. అక్టోబర్ 10న తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాధికారులకు సర్య్కూలర్‌ను పంపించింది. కాగా.. అక్టోబర్ 5న దసరా పండుగ జరగనుంది.