గుడ్ న్యూస్.. ఏపీలో మరో స్టీల్‌ప్లాంట్

AP Govt Allots Land to Jindal Steel. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటూ ప్రజలు ఓ వైపు ఉద్యమం చేపట్టగా.. ఆంధ్రప్రదేశ్

By Medi Samrat
Published on : 15 July 2021 6:56 PM IST

గుడ్ న్యూస్.. ఏపీలో మరో స్టీల్‌ప్లాంట్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటూ ప్రజలు ఓ వైపు ఉద్యమం చేపట్టగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో స్టీల్ ప్లాంట్ రాబోతుందనే వార్త బయటకు వచ్చింది. నెల్లూరు జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమ్మినపట్నం-మోమిడి పరిధిలో రూ.7,500 కోట్లతో 11.6 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేయనుంది. గతంలో కిన్నెటా పవర్‌కు ఇచ్చిన భూములను ప్రభుత్వం రద్దు చేసి వాటిని జిందాల్‌ సంస్థకు కేటాయించింది.

జిందాల్‌కు 860 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్టీల్‌ప్లాంట్‌తో 2,500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తూ ఉండగా.. 15వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ప్లాంట్‌ విస్తరణకు వచ్చే నాలుగేళ్లలో 3వేల ఎకరాలు అవసరమని అంచనా వేస్తున్నారు. అందుకు మద్దతుగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కొత్త స్టీల్ ప్లాంట్ కారణంగా చాలా మందికి ఉపాధి లభించనుంది.


Next Story