అమరావతి: గ్రాట్యుటీ, పెన్షన్ ఇతర బెనిఫిట్స్‌కు దరఖాస్తు ప్రక్రియ గజిబిజిగా ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందే ప్రక్రియలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీన్ని పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ 'రిటైర్మెంటు బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్' ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తోంది. మొత్తం ప్రక్రియను డిజిటల్‌గా మార్చి, ఉద్యోగులకు సులభతరం చేయనున్నారు. దీనివల్ల అనవసర ప్రక్రియలు తొలగనున్నాయి. ఈ కొత్త వ్యవస్థతో పత్రాల సమర్పణ చాలా తగ్గనుంది. అలాగే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని తప్పనుంది.
పూర్తిగా ఆన్‌లైన్‌లో అన్ని బెనిఫిట్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇది టైమ్‌ను ఆదా చేయడం కాకుండా, పారదర్శకతను కూడా పెంచుతుంది. ఈ నిర్ణయంతో రిటైర్డ్ ఉద్యోగుల జీవితం మరింత సులభతరంగా ఉంటుంది. ఈ వ్యవస్థలో ఐటీ టెక్నాలజీని భారీగా ఉపయోగించనున్నారు. ఐటీ సిస్టమ్స్ ద్వారా సీఎఫ్‌ఎమ్‌ఎస్, పేరోల్ వ్యవస్థలు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (పీఏజీ)కి నేరుగా అనుసంధానమై ఉద్యోగులకు మేలు జరగనుంది. టా బదిలీ సజావుగా జరిగి, ఆలస్యాలు తగ్గుతాయి. ఉద్యోగుల సర్వీస్ రికార్డులు, ఆర్థిక వివరాలు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయి. పెన్షనర్లకు ఇది గొప్ప ఉపశమనం కలిగిస్తుంది.