క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు

ఏపీలోని క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.

By Medi Samrat
Published on : 28 Aug 2025 6:53 PM IST

క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు

ఏపీలోని క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గత వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిన క్రీడాప్రోత్సాహకాలను కూటమి ప్రభుత్వం విడుదల చేసినట్లు శాప్ ఛైర్మన్ రవినాయుడు తెలిపారు. ఈరోజు రూ.4.9కోట్ల క్రీడా ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్ర‌భుత్వం విడుదల చేయడం హర్షణీయం అన్నారు. ఈ ప్రోత్సాహకాల విడుద‌ల‌తో ఏపీలో 43మంది అంతర్జాతీయ క్రీడాకారులకు లబ్ధి చేకూరిందని వెల్ల‌డించారు.

ప్రోత్సాహకాల విడుద‌ల‌తో క్రీడలు, క్రీడాకారుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకుందన్నారు. ప్రోత్సాహకాల విడుద‌ల ప‌ట్ల రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులందరూ సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. క్రీడాప్రోత్సాహకాలు విడుదల చేసినందుకు సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి క్రీడాకారుల తరుపున శాప్ ఛైర్మన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Next Story