ఎట్టకేలకు 6 నెలల గౌరవ వేతనం పొందిన మౌజన్లు, ఇమాములు

రాష్ట్రంలో ఇమాములు, మౌజాన్లకు 6నెలల గౌరవ వేతనం చెల్లింపు ప్రక్రియ ప్రభుత్వం పూర్తి చేసింది.

By Medi Samrat  Published on  27 Feb 2025 7:17 PM IST
ఎట్టకేలకు 6 నెలల గౌరవ వేతనం పొందిన మౌజన్లు, ఇమాములు

రాష్ట్రంలో ఇమాములు, మౌజాన్లకు 6నెలల గౌరవ వేతనం చెల్లింపు ప్రక్రియ ప్రభుత్వం పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 5000 మంది ఇమాములు, 5000 మౌజాన్లకు గౌరవ వేతనాలను చెల్లించేందుకు ఈనెల 18వ తేదీన ప్రభుత్వం రూ. 45 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 6 నెలలకు సంబంధించిన గౌరవ వేతనం చెల్లింపు ప్రక్రియ పూర్తయినట్లు రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతిలో గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 6 నెలలకు సంబంధించిన గౌరవ వేతనాన్ని ఇమాములు, మౌజన్లకు చెల్లించడంతో రంజాన్ మాసంకు ముందుగా చంద్రన్న కానుక అందిందన్న ఆనందంలో వారు ఉన్నారని అన్నారు. వారందరి తరఫున సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి ఫరూక్ వెల్లడించారు.

Next Story