డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపికబురు.. ఒక్కొక్కరికి రూ.1,00,000

రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలోనే డ్వాక్రా మహిళల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

By అంజి  Published on  5 March 2025 8:03 AM IST
AP government, new scheme, Dwakra women, APnews

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపికబురు.. ఒక్కొక్కరికి రూ.1,00,000

అమరావతి: రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలోనే డ్వాక్రా మహిళల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కొత్త పథకం కింద 5 శాతం వడ్డీతో రూ.లక్ష రుణం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పిల్లల చదువులు, వివాహాలు, ఇతర అవసరాల కోసం వీటిని అందించనుంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలకు సీఎంవో ఆమోదం తెలిపింది. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల చదువులు, వివాహాల కోసం బయట నుండి ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చుకుని రుణ భారం మోయలేక ఇబ్బంది పడుతుండటాన్ని ప్రభుత్వం గుర్తించింది.

ఈ క్రమంలోనే వారికి ఆర్థిక భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకం కోసం ఏటా రూ.1,000 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. మహిళా దినోత్సవం రోజున సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్టు సమాచారం. కాగా ఈ పథకాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సోసైటీ పరిధిలోని స్త్రీనిధి సంస్థ ద్వారా అమలు చేయనున్నారు. రాష్ట్రంలో కోటి మందికిపైగా డ్వాక్రా మహిళలు ఉన్నారు. అధికారులు ప్రస్తుతం ఈ పథకం అమలు కోసం నిధుల సమీకరణపై కసరత్తు చేస్తున్నారు.

Next Story