Andhrapradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ఉత్తర్వులు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం కల్పించింది.
By - అంజి |
Andhrapradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ఉత్తర్వులు
అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం కల్పించింది. కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం బదిలీలు ఉంటాయని పేర్కొంది. డిసిప్లినరీ, ఏసీబీ కేసులు ఉన్నవారు ట్రాన్స్‌ఫర్‌కు అనర్హులని తెలిపింది. ప్రొవిజనల్ సీనియారిటీ, క్లియర్ వేకెన్సీ ఆధారంగా బదిలీ అవుతారంది. పోర్టల్ ద్వారానే అప్లై చేసుకోవాలని, శాఖ సెక్రటరీలు ఇంటర్ బదిలీ ఆర్డర్లు ఇస్తారని తెలిపింది. ట్రాన్స్‌ఫర్లు రిక్వెస్ట్ బేసిస్ మీద మాత్రమే జరగనున్నాయి. ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది.
భర్త లేదా భార్య.. ఇద్దరిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండాలి. ప్రైవేట్ ఉద్యోగి అయితే స్పౌస్ గ్రౌండ్స్ వర్తించదు. నో డ్యూ సర్టిఫికెట్ తప్పనిసరి పేర్కొంది. మేరిట్ ర్యాంక్ ఆధారంగా సీనియారిటీ లిస్టులు ఉంటాయని తెలిపింది. బదిలీకి మ్యారేజ్ సర్టిఫికెట్, స్పౌస్ ఉద్యోగ ధృవీకరణ & ఎంప్లాయ్ ఐడి ఉండాలని తెలిపింది. క్లియర్ వేకెన్సీ ఉన్నప్పుడు మాత్రమే ట్రాన్స్‌ఫర్ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. కొత్త జిల్లాలో చివరి ర్యాంక్ కేటాయింపు ఉంటుందని, టై వచ్చినపుడు - సీనియారిటీ, తరువాత DOB ఆధారంగా ప్రాధాన్యం ఉంటుందని ప్రభుత్వం వివరించింది.
ప్రొసీజర్
- పోర్టల్ ద్వారా అప్లై అప్లే చేసుకోవాలి.
- ప్రొవిజనల్ సీనియారిటీ → ఆబ్జెక్షన్స్ → ఫైనల్ లిస్టు
- శాఖా సెక్రటరీలు ఇంటర్ డిస్ట్రిక్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్లు ఇస్తారు.
- మండల్/ULB అలాట్ చేయడం → తరువాత కౌన్సిలింగ్‌లో సెక్రటేరియట్ అలాట్
- ట్రాన్స్‌ఫర్ స్వయంకృత రక్వెస్ట్ కనుక TTA/DA లేదు
- పూర్తి ట్రాన్స్‌ఫర్ ప్రాసెస్: 30 నవంబర్ 2025 లోపు చేసుకోవాలి.