ఆంధ్రప్రదేశ్‌లోని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సదరం స్లాట్ బుకింగ్‌కు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దివ్యాంగుల వైకల్య నిర్దారణకు ఈ నెల 14 నుంచి సదరం స్లాట్ బుకింగ్‌ను ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలలకు స్లాట్లు అందుబాటులో ఉంటాయని సంబంధిత అధికారులు చెప్పారు. సదరం స్లాట్‌లను గ్రామ, వార్డు సచివాలయాల్లో బుక్ చేసుకోవాలని సూచించారు. ఆయా తేదీల్లోనిర్దేశించినజిల్లా, బోధనాస్పత్రులకు వెళ్లి వైద్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది.
సదరం సర్టిఫికెట్ల ఆధారంగానే పెన్షన్లకు అర్హత సాధిస్తారు. అర్హత సాధించిన వారికి దివ్యాంగుల పింఛన్లను మంజూరు చేస్తారు. పాక్షికంగా ఇబ్బందులు పడుతున్న దివ్యాంగులకు నెలకు ఆరువేలు, మంచానికే పరిమితమయిన వారికి నెలకు పదిహేను వేల రూపాయలను ప్రభుత్వం ప్రతి నెల పింఛను ఇస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సదరం స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి దివ్యాంగులు సిద్దమవ్వాలని అధికారులు పేర్కొన్నారు.