కృష్ణా నదీ యాజమాన్య బోర్టుకు ఏపీ ప్రభుత్వం లేఖ

AP Government Letter to Krishna River Ownership Board. కృష్ణా జ‌లాల‌లో అదనపు నీటిని వాడకుండా తెలంగాణను అడ్డుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

By Medi Samrat  Published on  5 April 2022 3:38 PM IST
కృష్ణా నదీ యాజమాన్య బోర్టుకు ఏపీ ప్రభుత్వం లేఖ

కృష్ణా జ‌లాల‌లో అదనపు నీటిని వాడకుండా తెలంగాణను అడ్డుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కు మరోసారి లేఖ రాసింది. కృష్ణా జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కొంతకాలంగా వాగ్వాదం జరుగుతోంది. రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల వాటా వివాదం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంపై కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా రాసిన లేఖ మరో వివాదంగా మారనుంది.

తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ జలాలను విద్యుత్ ఉత్పత్తికి వాడుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి హైదరాబాద్ లోని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు సభ్య కార్యదర్శికి లేఖ రాశారు. గతేడాది వర్షాకాలం రాకముందే నాగార్జున సాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తికి తరచుగా నీటిని వాడుకోవడం వల్ల పులిచింతల ప్రాజెక్టు వద్ద ఉన్న స్పిల్ వే రేడియల్ గేట్లను తెరిచి మూసివేయాల్సి వచ్చిందని లేఖలో పేర్కొన్నారు. దీంతో స్పిల్ వే గేట్ నంబర్ 16 కొట్టుకుపోయిందని, ఇప్పటికీ గేటు వేయలేదని గుర్తు చేశారు.










Next Story