అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పని గంటలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పని గంటలను 8 గంటల నుంచి 10 గంటలకు పెంచింది. అయితే వారానికి 48 గంటలకు మించకూడదన్న రూల్ పెట్టింది. దీని వల్ల వారానికి 5 రోజులు విధులు నిర్వహించే వారికి కొంత మేలు జరగనుంది. జారీ చేసిన ఉత్తర్వు నిన్నటి నుంచే అమల్లోకి వస్తుందని కార్మిక శాఖ కార్యదర్శి శేషగిరి రావు తెలిపారు. అయితే వారం మొత్తంలో పని గంటలు 48 గంటలు దాటితే ఓటీ కింద అదనపు మొత్తాన్ని చెల్లించాలని ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్ట సవరణ చేశారు.   
సంబంధిత జీవోను కార్మిక శాఖ కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు సోమవారం జారీచేశారు. మరోవైపు గతంలో ఐదు మంది కంటే ఎక్కువ మహిళలు ఉంటేనే వారికి రాత్రి వేళ డ్యూటీలకు అనుమతించేవారు. అయితే తాజా సవరణ ద్వారా రాత్రి డ్యూటీ చేసేందుకు ఒక్క మహిళా ఉద్యోగికి కూడా అనుమతిచ్చింది  మారిన పని గంటలు సోమవారం నుంచే అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొన్నటి వరకూ వారానికి 14 గంటలు, నెలకు 50గంటల అదనపు పనికి అవకాశం ఉంది. ఇప్పుడు క్వార్టర్‌కు (మూడు నెలలు) 144 గంటలే అదనపు పనికి అవకాశం కల్పించారు.