కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తులకు సంబంధించి మరో అప్‌డేట్

కొత్త రేషన్‌ కార్డుల దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

By అంజి
Published on : 11 May 2025 12:00 PM IST

AP government, new ration card applications, APnews

కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తులకు సంబంధించి మరో అప్‌డేట్

అమరావతి: కొత్త రేషన్‌ కార్డుల దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గత ప్రభుత్వ హయాంలో రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వైసీపీ హయాంలో వచ్చిన దరఖాస్తుల్లో 3.36 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, అవి ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు పేర్కొన్నాయి. కాగా రేషన్‌ కార్డుల కోసం ఈ నెల 15వ తేదీ నుంచి వాట్సాప్‌లోనూ దరఖాస్తులు స్వీకరించనుంది రాష్ట్ర ప్రభుత్వం.

జూన్‌లో కొత్త రేషన్‌ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాగా కొత్త రేషన్‌ కార్డులు, రేషన్‌ కార్డు స్ల్పిట్‌, కొత్త సభ్యుల చేరిక, అడ్రస్‌ మార్పులు చేసుకునేందుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. క్యూఆర్‌ కోడ్‌తో కూడిన రేషన్‌ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది. ఈ రేషణ్‌ కార్డుల ద్వారా దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకునే సదుపాయం ఉంటుంది. ప్రస్తుతం 95 శాతం రేషన్‌ లబ్ధిదారుల ఈ కేవైసీ పూర్తైందని ప్రభుత్వం తెలిపింది.

Next Story