ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. మద్యం షాపుల గడువు పెంపు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. మద్యం షాపుల గడువుపై కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం షాపుల గడవు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

By అంజి  Published on  30 Sep 2023 3:44 AM GMT
AP government,  liquor shops, APnews

ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. మద్యం షాపుల గడువు పెంపు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. మద్యం షాపుల గడువుపై కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం షాపుల గడవు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మద్యం షాపుల గడువును ప్రభుత్వం పొడిగించింది. రాష్ట్రంలో మద్యం షాపుల గడువు త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం షాపుల కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. మద్యం షాపుల గడువును ఏడాది పొడిగిస్తున్నట్లు అబ్కారీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ జీవో ఎంఎస్ నెంబరు 466ని జారీ చేశారు.

ఏపీ స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2,934 షాపులను కొనసాగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. అబ్కారీ శాఖ ఈ నిర్ణయం తీసుకోవడంతో ఎన్నికల వరకూ మద్యం దుకాణాలు ఇదే పద్ధతిలో కొనసాగనున్నాయి. కాగా గతంలో రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో అందుకు అనుగుణంగా కొన్ని చర్యలు తీసుకుంది. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

Next Story