అమరావతి: టెట్ ఫలితాలను వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం రేపు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. నెల రోజుల పాటు దరఖాస్తులకు సమయం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి 3 నుంచి మార్చి 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఒక రోజు కష్టంగా, మరో రోజు ఈజీగా పేపర్ వచ్చిందనే విమర్శలకు తావు లేకుండా రెండు, మూడు జిల్లాలకు కలిపి ఒకే రోజు పరీక్ష నిర్వహించడంపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.
డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. రాష్ట్రంలో నిన్న టెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. టెట్‌కు 3,68,661 మంది హాజరుకాగా 1,87,256 మంది ఉత్తీర్ణత సాధించారు. వారందరికీ మంత్రి లోకేష్ శుభాకాంక్షలు చెప్పారు. అభ్యర్థులకు సందేహాలుంటే ఉదయం 11.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు 9398810958, 7995649286, 6281704160, 7995789286 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.