గవర్నమెంట్ స్కూల్స్, జూనియర్ కాలేజీల్లో చదువుల్లో వెనుకబడిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి అదనంగా ఆన్‌లైన్‌లో బోధన అందించేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ చర్యలు చేపట్టింది. ఐఐటీ మద్రాస్‌లోని ఐఐటీఎం ప్రవర్తక్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఆన్‌లైన్ క్లాస్‌ల నిర్వహణ చేపట్టింది. దీనికి 'విద్యాశక్తి' ఈవెంట్‌గా పేరు పెట్టింది. ప్రభుత్వం ఇటీవలే ఐఐటీ మద్రాస్‌తో.. విద్యలో పలు సంస్కరణల కోసం డీల్ కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలోనే స్కూళ్లల్లో వెనుకబడిన విద్యార్థులకు అదనపు తరగతుల నిర్వహణను చేపట్టింది పాఠశాల విద్యాశాఖ.
గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఇది ప్రయోగాత్మకంగా అమలు అవుతోంది. ఇక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుత ప్రయోగాత్మక కార్యక్రమంలో 6 నుంచి 12 తరగతులకు మాత్రమే బోధన చేయిస్తున్నారు. స్కూల్ టైమ్ అయిపోయిన తర్వాత సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయంలో జూమ్ ద్వారా క్లాస్‌లు జరుగుతున్నాయి. విద్యార్థులకు లింక్ పంపిస్తుండగా, వారు ఐఎఫ్‌బీల ద్వారా లాగిన్ అయి పాఠాలు వింటున్నారు. అయితే ఈ తరగతులకు పదో విద్యార్థులను మినహాయించారు. వారికి 100 డేస్ ప్లానింగ్‌లో భాగంగా స్కూళ్లలోనే అదనపు తరగతులు జరుగుతున్నాయి.