రాష్ట్రంలోని కోర్టుల పరిధిలో దినసరి వేతనంతో పని చేస్తున్న మసాల్చీలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మసాల్చీల వేతనాన్ని రూ.300 నుంచి రూ.570కు పెంచినట్లు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ తెలిపారు. వీరు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న వేతన సమస్యను ప్రభుత్వం పరిష్కరించినట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేతనాన్ని పెంచడమే కాకుండా నెలలో 26 రోజులకు వర్తింపజేయనున్నట్లు తెలిపారు. నెలకు రూ.14,820 వేతనం అందుకోనున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మసాల్చీలు కోర్టు ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచుతారు.. అలాగే చిన్న చిన్న సహాయక పనులు చేస్తారు. కొంతకాలంగా వారు వేతనం పెంచాలని కోరుతున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం వారి కష్టాన్ని గుర్తించి వేతనం పెంచింది. ఇక నుంచి మసాల్చీలు నెలకు దాదాపు రూ.14,820 వరకు వేతనం పొందుతారు.