అమరావతి: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల్లోని '77 ఆటోమాటిక్ రిజర్వాయర్ వాటర్ లెవెల్ రికార్డర్స్ నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ప్లానింగ్ విభాగం నుంచి జలవనరుల శాఖకు వాటర్ లెవెల్ రికార్డ్స్ అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు వాటర్ లెవెల్ రికార్డర్ల పరిపాలన, నియంత్రణను బాధ్యతలను ప్లానింగ్ విభాగం చూస్తోంది..
ఇక నుంచి జలవనరుల శాఖకే వీటి నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌తో వాటర్ లెవెల్ రికార్డర్లు అనుసంధానం కానున్నాయి. ఈ అనుసంధానంతో సెంటలైజ్డ్ యాక్సెస్ సహా కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.