అమరావతి: అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీపీఎస్ అమలుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయగా.. గవర్నర్ ఆమోదించారు. ఈ మేరకు చట్టాన్ని సవరిస్తూ శుక్రవారం నాడు ప్రభుత్వం గెటిజ్ జారీ చేసింది. 2019లో బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్) ద్వారా 2018 ఆగస్టు వరకు ఉన్న నిర్మాణాల్ని రెగ్యులరైజ్ చేశారు. అయితే తాజాగా 59,041 అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించారు.
ఇప్పుడు వీటి క్రమబద్ధీకరణకు కటాఫ్ డేట్‌ను 2025 ఆగస్టు 31గా సవరించారు. ఆదాయ నష్ట నివారణ, సక్రమ పట్టణ విస్తరణ కోసం ఈ అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది. 2025 ఆగస్టు 31కి ముందు పర్మిషన్ తీసుకోకుండా చేపట్టిన 59,041 నిర్మాణాలు, 9,985 అదనపు అంతస్తులు, పర్మిషన్ తీసుకుని రూల్స్‌కు వ్యతిరేకంగా చేపట్టిన మరో 49,056 నిర్మాణాలు క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం ఛాన్స్ కల్పించింది. మరో రెండు రోజుల్లోగా ప్రభుత్వం బీపీఎస్ అమలుకు సమగ్ర మర్గదర్శకాలు రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.